ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి ప్రకటించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఫలితాల నమోదు ప్రక్రియ తుది దశకు చేరింది. ఈనెల 15 లేదా 16న వెల్లడించే అవకాశం ఉంది.
'ఈనెల 15 లేదా 16 తేదీల్లో ఇంటర్ ఫలితాలు' - త్వరలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు
ఈనెల 15 లేదా 16 తేదీల్లో ఇంటర్ ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి ప్రకటించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది.
'ఈనెల 15 లేదా 16 తేదీల్లో ఇంటర్ ఫలితాలు'
గత నెల 12 నుంచి 30 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం చేశారు. ప్రస్తుతం పత్రాల స్కానింగ్, మార్కుల అప్లోడ్, తుది పరిశీలన, ఇంటర్నెట్ మెమోల రూపకల్పన వంటి సాంకేతిక ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఈనెల 15 నాటికి ప్రక్రియ అంతా పూర్తవుతుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. మొత్తం తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులకు చెందిన 53 లక్షల జవాబు పత్రాల మూల్యాంకనం చేశారు.
ఇవీ చూడండి:హైకోర్టులో రేవంత్రెడ్డి ధిక్కరణ పిటిషన్