తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాల ప్రక్రియను ఇంటర్ బోర్డు పూర్తి చేసింది. మొదటి, రెండో సంవత్సర ఫలితాల వివరాల నివేదికను బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఇంటర్ ఫలితాలను ఎప్పుడు ప్రకటించాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రేపు లేదా ఎల్లుండి ఇంటర్ ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.
రెండ్రోజుల్లో ఇంటర్ ఫలితాలు.. ప్రభుత్వానికి బోర్డు నివేదిక - తెలంగాణ ఇంటర్ ఫలితాలు
ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలు బుధవారం లేదా గురువారం ప్రకటించే అవకాశం ఉంది. ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రక్రియను బోర్డు పూర్తి చేసి.. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
రెండ్రోజుల్లో ఇంటర్ ఫలితాలు.. ప్రక్రియ పూర్తి