Telangana Intermediate Board : 2022-23 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి తరగతులు, సెలవులు, పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 221 పని రోజులతో ఇంటర్ విద్యా సంవత్సరం ఉంటుందని తెలిపింది. అలాగే మొదటి సంవత్సరం తరగతులను జులై 1 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
జూన్ 15న ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులు షురూ - ఇంటర్ బోర్డు
Telangana Intermediate Board : 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్‌బోర్డు షెడ్యూల్ ఖరారు చేసింది. జూన్ 15న రెండో సంవత్సరం... జులై 1న మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. 2022-23 ఏడాదికి మొత్తం 221 పని రోజులతో ఇంటర్ విద్యా సంవత్సరం ఉంటుందని తెలిపింది.
‘‘ Inter Schedule 2022-23 : ఈ ఏడాది మొత్తం 221 పని దినాలు ఉంటాయి. జూన్ 15 నుంచి సెకండ్ ఇయర్, జులై 1 నుంచి ఫస్ట్ ఇంటర్ తరగతులు మొదలవుతాయి. అక్టోబరు 2 నుంచి 9 వరకు దసరా సెలవులు, జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నాం. ఫిబ్రవరి 6 నుంచి 13 వరకు ప్రీఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తాం. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగుతాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు అమలు అవుతాయి. 2023 మే చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాం. వచ్చే ఏడాది జూన్ 1న కాలేజీలు పునః ప్రారంభమవుతాయి’’ అని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఇదీ చదవండి:ssc exams review: 'పది'లో పొరపాట్లు జరగకుండా కంట్రోల్‌రూం