రాష్ట్రాన్ని ఉద్యాన రంగంలో ప్రగతి పథంలో నడిపించడానికి దేశంలో ఆ రంగంలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రాలను సందర్శించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యాన శాఖ సంచాలకుడు లోక వెంకటరామిరెడ్డి బృందం.. మహారాష్ట్ర నాసిక్ సమీపంలోని చించువాడ్ గ్రామంలో వాగ్రే మ్యాంగో ఫామ్స్‌ను సందర్శించింది. జనార్ధన్ వాగ్రే ప్రోద్బలంతో సుమారు 1200 ఎకరాల విస్తీర్ణంలో పెరుగుతున్న కేసర్ మామిడి తోటల పెంపకాన్ని వెంకటరామిరెడ్డి బృందం పరిశీలించింది.
'ఆ విధానంలో చెట్ల పెంపకంతో అధిక దిగుబడి' - Wagra Mango farm in Nashik
ఉద్యాన రంగంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని వాగ్రే మ్యాంగో ఫామ్స్‌ను రాష్ట్ర ఉద్యాన శాఖ సంచాలకుడు లోక వెంకటరామిరెడ్డి పరిశీలించారు.
!['ఆ విధానంలో చెట్ల పెంపకంతో అధిక దిగుబడి' loka Venkata rami reddy visited wagre mango farm](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9958178-thumbnail-3x2-a.jpg)
తెలంగాణ ఉద్యాన శాఖ సంచాలకుడు లోక వెంకటరామిరెడ్డి
నిర్దిష్ట అడుగుల దూరం పాటిస్తూ పెంచిన ఈ తోటలో చెట్లను 10 అడుగుల వరకు మాత్రమే పెంచుతున్నారు. ఈ పద్ధతిలో పెంచిన మామిడి పండ్లను కిలో రూ.110 నుంచి రూ.140 చొప్పున విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఎగుమతులతో అదనంగా రూ.70 నుంచి రూ.90 రూపాయలు మిగులుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మామిడి తోటలే కాకుండా జామ, సీతాఫలం తోటలు కూడా ఇదే పద్ధతిలో సాగు చేస్తున్నారని వెంకటరామిరెడ్డి తెలిపారు.
- ఇదీ చూడండి :భారత్‌లో భారీగా పెరిగిన చిరుతల సంఖ్య