గడీల పాలన తుదముట్టించి.. ఇంటి దొంగల భరతం పట్టడానికి తెలంగాణ ఇంటి పార్టీ కంకణం కట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. సామాజిక నేపథ్యంతో పుట్టుకొచ్చిన ఇంటి పార్టీ ఎప్పుడూ బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో 'ఉద్యమ సామాజిక శక్తుల రాజ్యాధికారానికై ఉద్యమిస్తాం' అశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
"తెలంగాణలో ఇంటి దొంగల భరతం పడతాం" - Cheruku Sudhakar Coments on Kcr
హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో 'ఉద్యమ సామాజిక శక్తుల రాజ్యాధికారానికై ఉద్యమిస్తాం' అశంపై సదస్సు జరిగింది. అసంఘటిత కార్మిక రంగాల హక్కుల సాధనకై పోరాడిన జనశక్తి నేత చంద్రన్న సంస్మరణ సభను బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 22న నిర్వహించనున్నట్లు ఇంటి పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ తెలిపారు.
"తెలంగాణలో ఇంటి దొంగల భరతం పడతాం"
అసంఘటిత కార్మిక రంగాల హక్కుల సాధనకై పోరాడిన జనశక్తి నేత చంద్రన్న సంస్మరణ సభను బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 22న నిర్వహించనున్నట్లు సుధాకర్ వెల్లడించారు. 25న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.