మేడ్చల్ జిల్లా కాప్రా కమలానగర్లో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ పర్యటించారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 24 పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఖైదీలకు భరోసా ఇవ్వడానికి, వివిధ అంశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నామని వెల్లడించారు.
'జైలు నుంచి విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పిస్తున్నాం' - medchal district news
ఖైదీలకు భరోసా ఇవ్వడానికి జైళ్ల శాఖ ఆధ్వర్యంలో వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేపడతున్నామని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. మేడ్చల్ జిల్లా కాప్రాలోని కమలానగర్లో పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు.
తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌లు
జైలు నుంచి విడుదలయ్యాక వారికి ఉద్యోగం కల్పిస్తున్నామని హోంమంత్రి చెప్పారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత జైళ్ల శాఖలో చాలా మార్పులు వచ్చాయన్న మహమూద్.. ఆదాయం పెరిగే ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే, జైళ్ల శాఖ డీఐజీ రాజీవ్ త్రివేది పాల్గొన్నారు.