తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల - తెలంగాణలో ప్రవేశ పరీక్షలు

ప్రవేశ పరీక్షల షెడ్యూలును రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అన్ని సెట్లకు సంబంధించిన తేదీలను... ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి విడుదల చేశారు. మే నెలలోనే అన్ని ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.

papireddy
papireddy

By

Published : Dec 24, 2019, 1:14 PM IST

2020-21విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, లాసెట్, పీఈసెట్, ఎడ్‌సెట్ తేదీలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి విడుదల చేశారు.

ఎంసెట్, ఈసెట్ నిర్వహణ బాధ్యతలు జేఎన్​టీయూకి, పీజీఈసెట్, లాసెట్, పీజీఎల్​ సెట్, ఎడ్ సెట్ బాధ్యతలు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి, ఐసెట్ కాకతీయకు, పీఈసెట్ బాధ్యతలు మహాత్మగాంధీ విశ్వవిద్యాలయానికి అప్పగిస్తామని తెలిపారు. అన్ని ప్రవేశపరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతాయని స్పష్టం చేశారు.

షెడ్యూలు

ఈసెట్

మే 2

ఇంజినీరింగ్ ఎంసెట్

మే 5, 6, 7

అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్

మే 9, 11

పీఈసెట్

మే 13

ఐసెట్

మే 20, 21

ఎడ్‌సెట్

మే 23

లాసెట్, పీజీలాసెట్

మే 25

పీజీఈసెట్

మే 27 నుంచి 30

ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఇదీ చూడండి: వైకల్యమే సిగ్గుపడేలా.. తోటివారికి సమానంగా..

ABOUT THE AUTHOR

...view details