ఇంజినీరింగ్ మొదటి విడత కౌన్సెలింగ్లో వచ్చిన సీటును రద్దు చేసుకొనే గడువును మరోసారి పొడిగించారు. ఈనెల 20 లేదా తుది విడత కౌన్సెలింగ్ ముందు రోజు వరకు రద్దు చేసుకోవచ్చునని ప్రవేశాల కమిటీ వెల్లడించింది. ఈనెల 21 నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది.
ఇంజినీరింగ్లో 48 కోర్సుల్లో కన్వీనర్ కోటాలో 78,270 సీట్లు ఉండగా.. మొదటి విడత కౌన్సెలింగ్లో 61,169 మందికి సీట్లు కేటాయించారు. వారిలో 46,322 మంది మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. సీటు రద్దు చేసుకుంటే విద్యార్థి చెల్లించిన బోధన రుసుము పూర్తిగా చెల్లిస్తారు. తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభమయ్యాక రద్దు చేసుకుంటే సగం ఫీజు మాత్రమే తిరిగి ఇస్తారు.