ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లో కరోనా పరీక్షలు, చికిత్సల పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది. గాంధీ, నిమ్స్‌లోనే కరోనా పరీక్షలు చేయించుకోవాలనడం రాజ్యాంగ విరుద్ధమని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో డబ్బులు చెల్లించి చికిత్స చేయించుకోవడం ప్రజల హక్కని తెలిపింది. ప్రైవేటు సంస్థలపై నమ్మకం లేకపోతే ఆరోగ్య శ్రీ సేవలకు ఎలా అనుమతులిచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు: హైకోర్టు
ప్రైవేటు ల్యాబ్‌లు, ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు, చికిత్స విషయంలో హైకోర్టు తీర్పును వెలువరించింది. ఐసీఎంఆర్ ఆమోదించిన ప్రతిచోటా కొవిడ్ పరీక్షలు చేసుకునేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు : హైకోర్టు
కరోనా సేవల కోసం ప్రైవేటు ల్యాబ్‌లు, ఆసుపత్రులు.. ఐసీఎంఆర్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోర్టు సూచించింది. అక్కడున్న వైద్య సిబ్బంది, సదుపాయాలను పరిశీలించి ఐసీఎంఆర్ నోటిఫై చేస్తుందని తెలిపింది. ఐసీఎంఆర్ ఆమోదించిన ఆసుపత్రుల్లోనే కరోనా చికిత్సలకు అనుమతించాలని ఆదేశించింది.
ఇవీ చూడండి:తొలిగిన అవరోధాలు.. ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు