తెలంగాణ

telangana

ETV Bharat / city

HIGH COURT: తల్లి చేసిన తప్పునకు శిశువును బలి చేయడం సరికాదు - pregnant woman

పీడీ చట్టం(PD ACT) కింద గర్భిణిని నిర్బంధించడం ఎంత వరకు సబబని హైకోర్టు(HIGH COURT) ప్రశ్నించింది. గర్భిణిగా ఉన్న తన కుమార్తెను పీడీ చట్టం కింద నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ.... నల్గొండకు చెందిన ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

pregnant woman
pregnant woman

By

Published : Jul 13, 2021, 4:35 AM IST

పీడీ చట్టం (PD ACT) కింద గర్భిణిని నిర్బంధించడం ఎంత వరకు సబబని హైకోర్టు(HIGH COURT) ప్రశ్నించింది. తల్లి చేసిన తప్పునకు శిశువును బలి చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. గర్భిణిగా ఉన్న తన కుమార్తెను పీడీ చట్టం కింద నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ నల్గొండకు చెందిన ఓ మహిళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గర్భిణిని నిర్బంధంలోకి తీసుకోవడం సరికాదని ఏప్రిల్‌ 28న తీర్పు వెలువరించామని, ఇదే తీర్పు ఇక్కడా ఎందుకు వర్తించదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది టి.శ్రీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ వైట్‌కాలర్‌ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గతంలో ఇచ్చిన తీర్పును పరిశీలించి వాదనలు వినిపించడానికి గడువు ఇవ్వాలని కోరడంతో విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.

రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరిలో వ్యభిచార నేరాలకు పాల్పడుతున్న మహిళను పీడీ చట్టం కింద నిర్బంధంలోకి తీసుకుంటూ ఇచ్చిన ఉత్తర్వులను ఇటీవల హైకోర్టు రద్దు చేసింది. ఆ సందర్భంగా

‘‘తల్లి తప్పులకు గర్భంలోని శిశువును శిక్షించడం సరికాదు. గర్భంతో ఉన్న మహిళను మానసిక ఒత్తిడికి గురిచేసే జైలులాంటి ప్రాంతాలకు దూరంగా ఉంచాలి’’ అని పేర్కొంది.

ఈ కారణంగా కేసులో ఇతర అంశాల జోలికి వెళ్లకుండా 8 నెలల గర్భిణిపై ఉన్న పీడీ ఉత్తర్వులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

ఇవీ చూడండి:Rayalaseema Lift Irrigation: రాయలసీమ ఎత్తిపోతలపై 23న ఎన్జీటీ విచారణ

ABOUT THE AUTHOR

...view details