తెలంగాణ

telangana

ETV Bharat / city

HIGH COURT: 'కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటికి వెళ్లండి' - telangana bc commission news

జల కాలుష్యానికి సంబంధించి అపీళ్లకు అప్పీలెట్​ అథారిటినే ఆశ్రయించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర బీసీ కమిషన్​ ఛైర్మన్​, సభ్యుల నియామక ప్రక్రియను మూడు వారాల్లోగా పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

telangana high court on pcb
telangana high court on pcb

By

Published : Aug 4, 2021, 8:44 PM IST

పీసీబీ ఆదేశాలపై అభ్యంతరాలుంటే కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీకి వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది. కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులపై దాఖలైన పలు పిటిషన్లతో పాటు.. అప్పీలెట్ అథారిటీ ఏర్పాటులో జాప్యంపై దాఖలైన పిల్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్​రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఛైర్మన్, సభ్యులను నియమిస్తూ నిన్న జీవో జారీ అయిందని.. రెండు, మూడు రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్ ఇస్తామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. జల కాలుష్యానికి సంబంధించిన అప్పీళ్లకు అప్పీలెట్ అథారిటినే ఆశ్రయించాలని స్పష్టం చేస్తూ పలు పిటిషన్లపై విచారణను హైకోర్టు ముగించింది.

రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్​, సభ్యుల నియామక ప్రక్రియను మూడు వారాల్లోగా పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు మరోసారి ఆదేశించింది. నాలుగు వారాల్లో బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని గతంలో హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్​కు చెందిన సామాజిక కార్యకర్తలు ఎస్.గణేష్​రావు, జే.శంకర్​ దాఖలు చేసిన పిల్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్​ బి.విజయసేన్​రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. నియామక ప్రక్రియ పూర్తిచేసేందుకు మరో నాలుగు వారాలు గడువు ఇవ్వాలని అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు కోరారు. మూడు వారాల్లోనే పూర్తి చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టం చేస్తూ విచారణను సెప్టెంబరు 25కి వాయిదా వేసింది.

ఇదీచూడండి:JAYABHERI: జయభేరి ప్రాపర్టీస్ ఛైర్మన్ మురళీమోహన్​కు హైకోర్టులో ఊరట

ABOUT THE AUTHOR

...view details