Telangana High Court : 'దళితబంధు నిలిపివేతపై ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం' - Dalit bandhu scheme Huzurabad
10:56 October 28
Telangana High Court : 'దళితబంధు నిలిపివేతపై ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం'
ఎన్నికల సంఘం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేతకు సంబంధించి ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలన్న అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
నిష్పక్షపాత ఎన్నికలకు నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని హైకోర్టు వెల్లడించింది. మల్లేపల్లి లక్ష్మయ్య, జడ్సన్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై సీజే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి ధర్మాసనం తీర్పు వెలువరించింది.