తెలంగాణ

telangana

ETV Bharat / city

విపత్కర పరిస్థితుల్లో.. ఊహించుకొని జోక్యం చేసుకోలేం: హైకోర్టు - హైదరాబాద్​లో భారీ వర్షాలు

భారీ వర్షాలపై రెండు రోజుల క్రితమే ప్రభుత్వం అందరినీ అప్రమత్తం చేసిందని హైకోర్టు పేర్కొంది. భారీ వర్షాల సహాయక చర్యల్లో సుమోటోగా జోక్యం చేసుకోవాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఊహించుకొని జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

telangana high court on rains
విపత్కర పరిస్థితుల్లో.. ఊహించుకొని జోక్యం చేసుకోలేం: హైకోర్టు

By

Published : Oct 15, 2020, 5:22 AM IST

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల సహాయక చర్యల్లో సుమోటోగా జోక్యం చేసుకోవాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

హైదరాబాద్​లో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ప్రాణనష్టం జరిగిందని న్యాయవాది నరేష్​రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించి ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ప్రభుత్వం.. రెండు రోజుల క్రితమే ప్రజలను అప్రమత్తం చేసిందని.. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఊహించుకొని జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వ సహాయక చర్యల్లో ఏవైనా లోపాలు కనిపిస్తే.. పిటిషన్ దాఖలు చేయవచ్చునని సూచించింది.

ఇవీచూడండి:రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... జనజీవనం అస్తవ్యస్థం

ABOUT THE AUTHOR

...view details