తెలంగాణ

telangana

ETV Bharat / city

OMC Case: శ్రీలక్ష్మి పిటిషన్​పై విచారణ.. మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరణ

ఓబుళాపురం గనులకు సంబంధించి సరిహద్దు వివాదం తేలే వరకు సీబీఐ కోర్టులో విచారణ నిలిపి వేయాలని కోరుతూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. శ్రీలక్ష్మిపై విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది.

శ్రీలక్ష్మి పిటిషన్​పై విచారణ.. మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరణ
శ్రీలక్ష్మి పిటిషన్​పై విచారణ.. మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరణ

By

Published : Jul 3, 2021, 12:08 AM IST

ఓబుళాపురం గనుల కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఓబుళాపురం గనులకు సంబంధించి సరిహద్దు వివాదం తేలే వరకు సీబీఐ కోర్టులో విచారణ నిలిపి వేయాలని కోరుతూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్​పై కోర్టు విచారణ జరిపింది. సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్​లో ఉందని.. అది తేలితే సీబీఐ మళ్లీ దర్యాప్తు చేసే అవకాశం ఉందని శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది వాదించారు. కాబట్టి అప్పటి వరకు సీబీఐ కోర్టులో విచారణ వాయిదా వేయాలని కోరారు.

మరో అభియోగపత్రం దాఖలు చేస్తారని శ్రీలక్ష్మి అనవసర ఆందోళన చెందుతున్నారని.. ఓఎంసీ కేసులో దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని సీబీఐ తరఫు న్యాయవాది సురేంద్ర తెలిపారు. శ్రీలక్ష్మి రకరకాల పిటిషన్లతో విచారణ ప్రక్రియను జాప్యం చేస్తున్నారని వాదించారు. ఓఎంసీ కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ కోర్టులో లిఖితపూర్వకంగా మెమో దాఖలు చేసి.. వివరాలు సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు సీబీఐ కోర్టులో తనపై విచారణ నిలిపివేయాలన్న శ్రీలక్ష్మి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:'అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతలను ఎలా నిర్మిస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details