HC On Face Recognition: ఏ చట్టం ఆధారంగా ముఖ గుర్తింపు సాంకేతికత వినియోగిస్తున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎఫ్ఆర్టీని సవాల్ చేస్తూ.. న్యాయవాది మసూద్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. పోలీసులు 2015లో తనను ఆపి అనుమతి లేకుండా ఫోటోలు, బయోమెట్రిక్ తీసుకున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. తన ఫోటో, బయోమెట్రిక్ వివరాలు తొలగించాలని పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసినప్పటికీ.. స్పందించలేదన్నారు.
HC On Face Recognition: 'ఏ చట్టం ఆధారంగా ముఖ గుర్తింపు సాంకేతికత వినియోగిస్తున్నారు..?' - ఎఫ్ఆర్టీ
HC On Face Recognition: ఎఫ్ఆర్టీని సవాల్ చేస్తూ.. న్యాయవాది మసూద్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏ చట్టం ఆధారంగా ముఖ గుర్తింపు సాంకేతికత వినియోగిస్తున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా ఎలాటి చట్టబద్ధత లేకుండా ఫోటోలు తీసుకుంటున్నారని.. ఎఫ్ఆర్టీ కోసం 2018 నుంచి పలు ఏర్పాట్లు కూడా చేశారని పిటిషనర్ న్యాయవాది వివరించారు. నగరంలో సుమారు 50వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు.. సీసీటీఎన్ఎస్ ద్వారా సమాచారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటున్నాయన్నారు. అయితే సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారు.. ఎలా వినియోగిస్తున్నారో తెలపడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న హైకోర్టు.. పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.
ఇదీ చూడండి: