Teacher Transfers in Telangana: టీచర్ల అప్పీళ్లపై హైకోర్టు కీలక ఆదేశాలు - తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీ వార్తలు
![Teacher Transfers in Telangana: టీచర్ల అప్పీళ్లపై హైకోర్టు కీలక ఆదేశాలు telangana HIGH COURT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14040830-824-14040830-1640770974475.jpg)
15:06 December 29
టీచర్ల అప్పీళ్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
Teacher Transfers in Telangana: కొత్త జిల్లాలకు కేటాయింపులపై ఉపాధ్యాయుల అప్పీళ్లను తేల్చాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జీవోకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపును పునఃపరిశీలించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
పనిచేస్తున్న జిల్లా నుంచి మరో ప్రాంతానికి కేటాయించడాన్ని సవాల్చేస్తూ టీచర్లు దాఖలు చేసిన పలు పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. సీనియారిటీ, భార్యభర్తలు ఒకే జిల్లాలో పనిచేయడం వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకొని తమ కేటాయింపులను పునఃపరిశీలించాలని పిటిషనర్ల న్యాయవాదులు కోరారు. ఉపాధ్యాయుల అప్పీళ్లను జీవోకు అనుగుణంగా పరిశీలిస్తామని పాఠశాల విద్యాశాఖ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. విద్యాశాఖ వివరణను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. రేపటి వరకు అప్పీళ్లను పరిష్కరించే ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది. మరికొన్ని పిటిషన్ల పరిష్కారం కోసం విద్యాశాఖకు జనవరి 10 వరకు హైకోర్టు గడువు ఇచ్చింది.
ఇదీచూడండి:TS High Court: హైకోర్టు దృష్టికి కొత్త సంవత్సర వేడుకల వ్యవహారం...