Telangana High Court on G.O. 402 : ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల పరస్పర బదిలీలకు చెందిన జీవో 21కు సవరణ తీసుకువస్తూ జారీ చేసిన జీవో 402 అమలుపై యథాతథస్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 19న జారీ చేసిన జీవో 402ను సవాలు చేస్తూ కె.తిరుపతిరెడ్డితో పాటు మరో 9 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు.
అప్పటివరకు జీవో 402 అమలుపై యథాతథ స్థితి - తెలంగాణ హైకోర్టు న్యూస్
Telangana High Court on GO 402 : జీవో 402 అమలుపై యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల పరస్పర బదిలీలకు చెందిన జీవో 21కు సవరణ తీసుకువస్తూ జారీ చేసిన ఈ జీవోను సవాల్ చేస్తూ ఫిబ్రవరిలో కొందరు వేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది.
Telangana High Court on GO 402
పిటిషనర్ల తరఫున ఎం.రాంగోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ..ఇప్పటికే జీవో 317 ప్రకారం కొత్త జిల్లాలకు కేటాయింపులు పూర్తయినందున, ఏ బదిలీ జరిగినా అది అంతర్ జిల్లానే అవుతుందన్నారు. అందువల్ల జీవో 402 చట్టవిరుద్ధమని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఈ పిటిషన్‌లపై విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు జీవో అమలుపై యథాతథస్థితి కొనసాగించాలన్నారు.
- ఇదీ చదవండి :ధాన్యం కొనేవరకు పోరాటం ఆగదు