తెలంగాణ

telangana

ETV Bharat / city

Ramappa: నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుంది: హైకోర్టు - ramappa latest news

telangana-high-court-on-ramappa-temple-development
telangana-high-court-on-ramappa-temple-development

By

Published : Jul 28, 2021, 12:48 PM IST

Updated : Jul 28, 2021, 3:08 PM IST

12:42 July 28

Ramappa: నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుంది: హైకోర్టు

అంతర్జాతీయ గుర్తింపు పొందిన రామప్ప చారిత్రక సంపద సంరక్షణపై హైకోర్టు విచారణ చేపట్టింది. పత్రికల కథనాలను సుమోటోగా స్వీకరించిన.. సీజే జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. రామప్పకు యునెస్కో గుర్తింపు రావటం రాష్ట్రానికి గర్వకారణమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. యునెస్కో విధించిన గడువు(డిసెంబరు నెలాఖరు) వరకు సమగ్ర సంరక్షణ చేపట్టాలని సర్కారును హైకోర్టు ఆదేశించింది.  

నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుంది..

ఏఎస్ఐ, రాష్ట్ర పురావస్తుశాఖ, కలెక్టర్‌తో కమిటీ వేయాలని సూచించిన ధర్మాసనం... ఆగస్టు 4న కమిటీ తొలి సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో సంయుక్త పరిశీలన జరపాలని తెలిపింది. నాలుగు వారాల్లో కమిటీ నివేదిక సమర్పించాలని సూచించింది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుందని హైకోర్టు హెచ్చరించింది. కాలపరిమితులు విధించుకుని అధికారులు పనిచేయాలని సూచించింది.

స్వయంగా పర్యవేక్షిస్తాం...

రామప్ప కట్టడం చారిత్రకంగా అత్యంత విలువైందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇప్పుడు రామప్ప అంతర్జాతీయ పర్యాటన ప్రాంతంగా మారుతుందన్న హైకోర్టు.. ఆలయాన్ని ప్రపంచ అంచనాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ఆదేశించింది. రామప్ప అభివృద్ధి అంశాన్ని తామే... స్వయంగా పర్యవేక్షిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 25కి ధర్మాసనం వాయిదా వేసింది.  

 

 

ఇవీ చూడండి:

Last Updated : Jul 28, 2021, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details