తెలంగాణ

telangana

ETV Bharat / city

అమర జవాను కుటుంబానికి హైకోర్టు జోక్యంతో న్యాయం - news on lans naik feroz khan EX GRATIA

జమ్ముకశ్మీర్​లోని పూంచ్​ జిల్లా సరిహద్దుల్లో 2013లో దాయాది కాల్పుల్లో వీరమరణం పొందిన లాన్స్​నాయక్​ మహమ్మద్​ ఫిరోజ్​ఖాన్​కు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. నోటీసులు ఇచ్చిన తర్వాతైనా ప్రభుత్వం స్పందించడం సంతోషకరమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పరిహారం చెల్లించినట్లు ఈనెల 19లోగా ఆధారాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

TELANGANA HIGH COURT ON LANS NAIK EXGATIA ORDERS TO SUBMIT DETAILS
ఎట్టకేలకు లాన్స్​నాయక్​ ఫిరోజ్​ఖాన్​కు పరిహారం.. ఆధారాలు అడిగిన కోర్టు

By

Published : Aug 11, 2020, 3:21 PM IST

ఏడేళ్ల క్రితం జమ్ముకశ్మీర్​లో పాకిస్తాన్ కాల్పుల్లో అమరుడైన లాన్స్​నాయక్ మహమ్మద్ ఫిరోజ్​ఖాన్​కు ప్రభుత్వం ఎట్టకేలకు పరిహారం చెల్లించింది. అమరజవాను భార్య బ్యాంకు ఖాతాలో గత నెల 31న రూ.29 లక్షలు జమచేసినట్టు హైకోర్టుకు సర్కారు నివేదించింది.

జమ్ముకశ్మీర్​లోని పూంచ్​ జిల్లా సరిహద్దుల్లో 2013లో జరిగిన కాల్పుల్లో లాన్స్​నాయక్ వీరమరణం పొందారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.29 లక్షల రూపాయల ఎక్స్​గ్రేషియా చెల్లించడం లేదని.. ఫిరోజ్​ఖాన్ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని వివరిస్తూ న్యాయవాది పవన్​కుమార్ హైకోర్టుకు లేఖ రాశారు. పరిహారం చెల్లింపులో ఎందుకు జాప్యం జరుగుతుందో తెలపాలని జీఏడీ, ఆర్థిక శాఖల ముఖ్యకార్యదర్శులు, హైదరాబాద్ కలెక్టర్​కు గత నెల 27న హైకోర్టు నోటీసులు జారీచేసింది.

ఈ కేసులో ఇవాళ్టి విచారణ సందర్భంగా గత నెల 31న అమరుడి భార్య బ్యాంకు ఖాతాలో రూ.29 లక్షలు జమచేసినట్టు ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. నోటీసులు ఇచ్చిన తర్వాతైనా ప్రభుత్వం స్పందించడం సంతోషకరమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఫిరోజ్​ఖాన్​ భార్య బ్యాంకు ఖాతాకు రూ.29 లక్షల రూపాయలు బదిలీ అయినట్టు ఈనెల 19లోగా ఆధారాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

ఇవీచూడండి :తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెకు సమాన హక్కులుంటాయ్​: సుప్రీం

ABOUT THE AUTHOR

...view details