తెలంగాణ

telangana

ETV Bharat / city

వైద్య సిబ్బందిపై దాడుల ఘటనలు ఎన్ని? - high court on attacks on medical staff

వైద్య సిబ్బందిపై దాడుల ఘటనలకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రుల వద్ద ఎంతమంది పోలీసులు ఉంటున్నారో తెలపాలని కోరింది.

telangana high court Inquiry on attacks on medical staff
వైద్యుల భద్రతపై హైకోర్టు విచారణ

By

Published : Apr 24, 2020, 2:36 PM IST

కరోనా చికిత్సలు చేస్తున్న వైద్య సిబ్బంది భద్రతపై హైకోర్టు విచారణ జరిపింది. కొవిడ్​-19 ఆసుపత్రుల వద్ద భద్రత పెంచినట్లు రాష్ట్ర సర్కార్​ హైకోర్టుకు నివేదించింది. వైద్య సిబ్బందిపై దాడులకు సంబంధించి 4 కేసులు నమోదైనట్లు తెలిపింది.

ఆసుపత్రుల వద్ద ఎంతమంది పోలీసులు ఉంటున్నారో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వైద్య సిబ్బందిపై దాడుల ఘటనలు ఎన్ని జరిగాయని ప్రశ్నించింది. రెండు వారాల్లో మరింత సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details