మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో లేదని (high court on liquor tenders ) హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లకు చట్టబద్ధత లేకపోయినప్పటికీ.. కేవలం సానుభూతి, దయతో కల్పించిందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
high court on liquor tenders: మద్యం దుకాణాల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలంటూ తెలంగాణ రిపబ్లికన్ పార్టీ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సీజే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. మద్యం దుకాణాల కేటాయింపులో ప్రభుత్వం ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించిందని... అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు 15.45 శాతం, ఎస్టీలు 9.08 శాతం ఉన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. జనాభా ప్రాతిపదికను పరిగణలోకి తీసుకోకుండా రిజర్వేషన్లు ఖరారు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.