తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana High Court: 'కరోనా కేసులు పెరుగుతున్నాయి.. జాగ్రత్త..!'

Telangana High Court
కరోనా కేసులపై హైకోర్టులో విచారణ

By

Published : Jun 8, 2022, 12:58 PM IST

Updated : Jun 8, 2022, 2:21 PM IST

12:56 June 08

కరోనా కేసులపై హైకోర్టులో విచారణ

HC on Covid Cases: రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. కరోనా కేసులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం తెలిపింది. తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కేసులు పెరుగుతున్నందున తగిన చర్యలు తీసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం స్పష్టం చేసింది.

కరోనా మృతుల కుటుంబాలకు 15 రోజుల్లో ఎక్స్​గ్రేషియా చెల్లించేలా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది.

Last Updated : Jun 8, 2022, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details