తెలంగాణ

telangana

ETV Bharat / city

Puppalaguda land auction: పుప్పాలగూడలో ఐదు ప్లాట్ల వేలంపై హైకోర్టు స్టే

telangana-high-court-give-stay-on-puppalaguda-land-auction
telangana-high-court-give-stay-on-puppalaguda-land-auction

By

Published : Sep 21, 2021, 8:43 PM IST

Updated : Sep 21, 2021, 9:20 PM IST

20:40 September 21

లక్ష్మి ఇంజినీరింగ్‌, కన్‌స్ట్రక్షన్స్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ

మరో దఫా భూముల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కాగా.. పుప్పాలగూడలోని ఐదు ప్లాట్ల వేలంపై హైకోర్టు స్టే విధించింది. సర్వేనంబర్‌ 301లోని 5 ప్లాట్లు వేలం వేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కోకాపేట, ఖానామెట్​లోని భూములకు విక్రయించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా.. మరోమారు ఖానామెట్, పుప్పాలగూడ భూముల వేలాన్ని చేపట్టింది. ఖానామెట్​లోని 22.79 ఎకరాల విస్తీర్ణం, పుప్పాలగూడలోని 94.56 ఎకరాల భూముల వేలం ప్రక్రియను చేపట్టింది. మొత్తం రెండు చోట్లా కలిపి 117.35 ఎకరాల విస్తీర్ణంలో 35 ప్లాట్లను వేలం వేయనున్నారు. ఇందుకోసం టీఎస్ఐఐసీ నోటిఫికేషన్ కూడా జారీ అయ్యింది.

సెప్టెంబర్ తొమ్మిదో తేదీన ప్రీబిడ్ సమావేశం నిర్వహించారు. ఖానామెట్ భూములను సెప్టెంబర్ 27న, పుప్పాలగూడ భూములను 29వ తేదీన ఈ-ఆక్షన్ విధానంలో వేలం నిర్వహించనుండగా.. ప్లాట్ల వేలంపై లక్ష్మి ఇంజినీరింగ్‌, కన్‌స్ట్రక్షన్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. తమ భూములు వేలం వేస్తున్నారని లక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ వేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

కోకాపేట, ఖానామెట్​ భూముల విక్రయాలకు వచ్చిన స్పందన ఆధారంగా.. భూములకు కనీస విలువను ప్రభుత్వం ఖరారు చేసింది. ఖానామెట్ భూములకు కనీస విలువ ఎకరానికి 40 లక్షల రూపాయలు, పుప్పాలగూడ భూములకు కనీస విలువ 35 లక్షల రూపాయలుగా ఖరారు చేసింది.

ఇదీ చూడండి:

Last Updated : Sep 21, 2021, 9:20 PM IST

ABOUT THE AUTHOR

...view details