కొత్త విధానాల పేరుతో రెవెన్యూ అధికారులు రైతులను వేధిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. నలభై ఏళ్లుగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న భూమికి.. ఈ- పాస్‌బుక్‌లు జారీ చేయడానికి అభ్యంతరాలేమిటని ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం సికిందర్గూడలో 38 ఎకరాల భూమికి బుర్ర వేణుగోపాల్ గౌడ్ తదితరులకు ఈ- పాస్‌పుస్తకాలు జారీ చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఆదేశించారు. సింగిల్ జడ్జి ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ... ప్రభుత్వంతో పాటు ఎస్టేట్ వారసులు అప్పీల్ దాఖలు చేయగా.. ధర్మాసనం స్టే జారీ చేసింది.
కొత్త విధానాల పేరుతో రైతులను వేధించడం సరికాదు: హైకోర్టు
నలభై ఏళ్లుగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న భూమికి.. ఈ- పాస్‌బుక్‌లు జారీ చేయడానికి అభ్యంతరాలేమిటని రెవెన్యూ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. కొత్త విధానాల పేరుతో రెవెన్యూ అధికారులు రైతులను వేధిస్తున్నారని... ఓ స్థలానికి సంబంధించిన కేసు విచారణలో ధర్మాసనం వ్యాఖ్యానించింది.
telangana high court fire on revenue officials
సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేస్తూ ఇచ్చిన స్టే ఉత్తర్వులను పొడిగించాలని ధర్మాసనాన్ని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. కొత్తగా హక్కులు అడగటం లేదని.. పట్టాదారు పాస్‌పుస్తకాల స్థానంలో ఈ- పాస్‌బుక్కులు జారీ చేయాలని కోరుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. స్టే పొడిగించాలని.. గడువు ఇస్తే కారణాలను వివరిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరటం వల్ల విచారణను ధర్మాసనం ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది.