జీవో 208పై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు(Telangana High Court) విచారణ ముగించింది. 58కోట్లు విడుదల చేయవద్దన్న ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం ఉపసంహరించింది. సవరించిన జీవో సమర్పించాలని ఇటీవల ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Telangana High Court : జీవో 208పై దాఖలైన పిల్‌పై విచారణ ముగించిన హైకోర్టు - telangana high court dismissed the stay on g.o. number 208
జీవో 208 నిధుల విడుదలపై స్టేను హైకోర్టు(Telangana High Court) ఎత్తివేసింది. ఈ జీవోపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ నేటితో ముగించింది.
జీవో 208పై దాఖలైన పిల్‌పై విచారణ ముగించిన హైకోర్టు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమర్పించిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని అడ్వొకేట్ జనరల్ హైకోర్టును కోరారు. జీవో నేపథ్యాన్ని అఫిడవిట్‌లో సీఎస్ వివరించారని ఏజీ ప్రసాద్ పేర్కొన్నారు. భూసేకరణ పరిహారం కోసమే 58కోట్లు కేటాయించామని ఏజీ వివరణ ఇచ్చారు. ఏజీ అభ్యర్థనతో నిధుల విడుదలపై స్టే ఎత్తివేసిన హైకోర్టు.. లెక్చరర్ ప్రభాకర్ పిల్‌పై విచారణ ముగించింది.
- ఇదీ చూడండి:'కొత్త ఐటీ రూల్స్ పాటిస్తున్న ట్విట్టర్'