హైదరాబాద్ కార్పొరేషన్‌లో నిర్మాణ వివాదాల పరిష్కారం నిమిత్తం చట్టప్రకారం మున్సిపల్ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి 2019లో దాఖలైన పిటిషన్‌లో కౌంటరు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణలోగా కౌంటరు దాఖలు చేయకుంటే వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీచేసింది.
Telangana High Court News : 'ట్రైబ్యునల్ ఏర్పాటుపై కౌంటరు దాఖలు చేయండి'
హైదరాబాద్ కార్పొరేషన్‌లో నిర్మాణ వివాదాల పరిష్కారం నిమిత్తం చట్టప్రకారం మున్సిపల్ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి 2019లో దాఖలైన పిటిషన్‌లో కౌంటరు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నేటికీ కౌంటరు దాఖలు చేయకపోవడంతో విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.
Telangana High Court News
సవరించిన చట్టం ప్రకారం బిల్డింగ్ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసి ఛైర్మన్, సభ్యులను నియమించకపోవడాన్ని సవాలు చేస్తూ ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిశ్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నేటికీ కౌంటరు దాఖలు చేయకపోవడంతో విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.