తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్​టీ పీసీఆర్​ ల్యాబ్​లలో ఖాళీల భర్తీకి పచ్చజెండా - తెలంగాణలో కొవిడ్​ ప్రభావం

రాష్ట్రంలోని ఆర్​టీపీసీఆర్​ ల్యాబ్​లలో ఖాళీల భర్తీకి వైద్యారోగ్య శాఖ పచ్చజెండా ఊపింది. సైంటిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్​ల పోస్టులను భర్తీ చేయనుంది.

TELANGAN GOVERNMENT SYMBOL
TELANGAN GOVERNMENT SYMBOL

By

Published : Jan 7, 2021, 6:24 PM IST

రాష్ట్రంలోని ఆర్​టీపీసీఆర్​ ల్యాబ్​లలో ఖాళీలను భర్తీ చేసేందుకు వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లోని ఆరు వైద్య కళాశాలల్లోని ల్యాబ్​లు సహా కరీంనగర్ జిల్లా ఆస్పత్రి ల్యాబ్​లో పనిచేసేందుకు గాను 84 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది.

కాంట్రాక్టు లేదా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆదేశాల్లో పేర్కొంది. ఆరు నెలల కాలానికి కాంట్రాక్టు ఉంటుందని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా సైంటిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్​ల పోస్టులను భర్తీ చేయనుంది.

ఆదిలాబాద్ రిమ్స్​లో ముగ్గురు సైంటిస్ట్​లు, నిజామాబాద్, మహబూబ్​నగర్, సిద్దిపేట, నల్గొండ మెడకల్ కళాశాలు, కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో మూడేసి చొప్పున సైంటిస్టు పోస్టులను భర్తీ చేయనుంది. ఆయా ఆస్పత్రుల్లో ఆరుగురు ల్యాబ్ టెక్నీషియన్, మూడు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులనూ నియమించనుంది. థర్డ్​ పార్టీ ఏజెన్సీల ద్వారా ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

ఇవీచూడండి:కొవాగ్జిన్​ మూడో దశ ట్రయల్స్​కు వాలంటీర్ల ఉత్సాహం

ABOUT THE AUTHOR

...view details