Minister Harish on Omicron : రానున్న రోజుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలొస్తున్నందున రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య మంత్రి హరీశ్ రావు సూచించారు. అందరు కరోనా నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని, ఎక్కువగా గుమిగూడి ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని చెప్పారు. ఒమిక్రాన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి.. వ్యాక్సినేషన్, అప్రమత్తతో దాన్ని జయించవచ్చని అన్నారు.
Minister Harish at Vanasthalipuram Area Hospital : రాష్ట్రంలో కరోనా మూడో ముప్పు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు సర్కార్ సిద్ధమని మంత్రి హరీశ్ తెలిపారు. హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని సందర్శించిన ఆయన.. 100 పడకల వార్డు, ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించారు. నిర్మాణ్ సంస్థ సహకారంతో 12 ఐసీయూ పడకల వార్డు, ఇన్ఫోసిస్ సహకారంతో ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు హరీశ్ రావు తెలిపారు.
"అందరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలి. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ తీవ్రత తక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి. అలా అని నిర్లక్యం వద్దు. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి. పండుగల వేళ మరింత జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ వినియోగించాలి. ప్రభుత్వానికి సహకరించాలి."