తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా థర్డ్​వేవ్​ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: మంత్రి హరీశ్​రావు - మంత్రి హరీశ్​రావు టెలీ కాన్ఫరెన్స్​

Covid Third wave: కరోనా థర్డ్​ వేవ్​ను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా వైద్యాధికారులకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు స్పష్టం చేశారు. రెండో డోసు లక్ష్యాన్ని వంద శాతం పూర్తిచేయడం సహా 15-18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు. కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో డైరెక్టర్​ ఆఫ్​ హెల్త్​ శ్రీనివాసరావుతో కలిసి.. అన్ని జిల్లాల వైద్యాధికారులు, ఆశావర్కర్లతో మంత్రి హరీశ్​ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

minister harish rao on corona
minister harish rao

By

Published : Jan 7, 2022, 5:45 PM IST

Covid Third wave: కొవిడ్​పై పోరులో మున్సిపల్, పంచాయతీశాఖలతో పాటు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అధికారులకు సూచించారు. కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో డైరెక్టర్​ ఆఫ్​ హెల్త్​ శ్రీనివాసరావుతో కలిసి.. అన్ని జిల్లాల వైద్యాధికారులు, ఆశావర్కర్లతో మంత్రి హరీశ్​ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి

harish rao on Covid Third wave: కరోనా థర్డ్​ వేవ్​ను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని హరీశ్​రావు ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్​పై ప్రత్యేకంగా దృష్టిసారించాలని సూచించారు. రెండో డోసు లక్ష్యాన్ని వంద శాతం పూర్తిచేయడం సహా 15-18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు. 60 ఏళ్లు పైబడిన వారిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రాధాన్యం ఇచ్చి బూస్టర్ డోస్ త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

స్థానికంగా ఐసోలేషన్ కేంద్రాలు..!

ఆశావర్కర్ల పరిధిలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారు ఒక్కరూ ఉండకూడదనే లక్ష్యంతో పనిచేయాలని నిర్దేశించారు. పీహెచ్​సీలు, సబ్​సెంటర్ల స్థాయిలోనే కొవిడ్ రోగులకు మెరుగైన చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ప్రజలు అప్పుల పాలుకాకుండా చూడాలని సూచించారు. అవసరమైతే ప్రజాప్రతినిధుల సహకారంతో స్థానికంగా ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటుచేయాలన్నారు.

సేవల్లో నెంబర్​వన్ కావాలి

ఇదే సమయంలో అన్ని ఆస్పత్రుల్లో ఓపీ, గర్భిణులకు సేవలు, దీర్ఘకాలిక రోగులకు సేవలు అందించడంలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించి, దేశంలోనే తెలంగాణ ఆరోగ్య రంగాన్ని మొదటి స్థానానికి చేర్చాలని అధికారులు, సిబ్బందికి మంత్రి హరీశ్​రావు స్పష్టం చేశారు.

ఇదీచూడండి:High Court about Corona : పిల్లల కోసం వైద్య సదుపాయాలు మరింత పెంచాలి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details