తెలంగాణ

telangana

ETV Bharat / city

Minister Harish at Niloufer Hospital : 'సర్కార్ దవాఖానాల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తాం' - నిలోఫర్ ఆస్పత్రిలో మంత్రి హరీశ్ రావు

ప్రభుత్వ దవాఖానాలపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Telangana health minister Harish Rao) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హరీశ్ రావు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రి(Niloufer Hospital)ని సందర్శించారు. ఈ దవాఖానాలో వంద పడకల ఐసీయూ వార్డును(ICU ward inauguration) ప్రారంభించారు.

Minister Harish at Niloufer Hospital
Minister Harish at Niloufer Hospital

By

Published : Nov 13, 2021, 12:27 PM IST

సర్కార్ దవాఖానాల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తాం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందేలా కృషి చేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఉద్ఘాటించారు. సర్కార్ దవాఖానాల్లో వైద్యంపై ప్రజలకు మరింత విశ్వాసం కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హరీశ్ రావు(Telangana health minister Harish Rao).. మొదటిసారిగా నిలోఫర్ ఆస్పత్రి(Niloufer Hospital)ని సందర్శించారు. ఆస్పత్రిలో 100 పడకల ఐసీయూ వార్డు(ICU ward in Niloufer Hospital)ను ప్రారంభించారు.

రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం సమర్థంగా పనిచేద్దామని నిలోఫర్ ఆస్పత్రి(Niloufer Hospital) వైద్యులు, సిబ్బందికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Telangana health minister Harish Rao) సూచించారు. కరోనా రెండో దశ తర్వాత పెద్దఎత్తున ప్రభుత్వ ఆస్పత్రులు బలోపేతమయ్యాయని తెలిపారు. సర్కార్ దవాఖానాల బలోపేతానికి రూ.18 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రూ.10వేల కోట్లు కేటాయించి రాష్ట్ర ఆరోగ్య శాఖ(Telangana health ministry)ను అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు.

"ఆరోగ్య మంత్రి(Telangana health minister Harish Rao)గా బాధ్యతలు తీసుకున్నాక మొదటి కార్యక్రమమే నిలోఫర్ ఆస్పత్రి(Niloufer hospital)లో పాల్గొనడం సంతోషంగా ఉంది. కేసీఆర్ కిట్(KCR kit) వచ్చాక గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ఉన్న డెలివరీ రేట్(delivery rate in govt hospitals)​ 50 శాతానికి పెరిగింది. తల్లి, పిల్లల మరణాలు గణనీయంగా తగ్గాయి. భాగ్యనగరం నాలుగు వైపుల నాలుగు మెడికల్ టవర్​లు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి మరో 8 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువస్తాం."

- హరీశ్ రావు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి

ప్రతి జిలాలల్లో ఒక మెడికల్ కళాశాల ఉండాలనే సంకల్పంతో కేసీఆర్ సర్కార్(Telangana government) కృషి చేస్తోందని హరీశ్ రావు(Telangana health minister Harish Rao) అన్నారు. రూ.33 కోట్లతో నిలోఫర్​(Niloufer hospital)లో మరో 800 పడకలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మూడో దశ కరోనాకు అడ్డుకట్ట వేయడానికి వైద్యఆరోగ్య శాఖ(Telangana health ministry) సన్నద్ధంగా ఉందని.. దానికోసం రూ.133 కోట్లు కేటాయించామని వెల్లడించారు. 5000 పడకలను చిన్నపిల్లల కోసం సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. దేశ సగటు కంటే తెలంగాణ రాష్ట్రం.. వ్యాక్సినేషన్(corona vaccination in telangana)​లో ముందు ఉందని మంత్రి వివరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details