Minister Harish Rao Interview : రాబోయే రోజుల్లో కార్పొరేట్ ఆసుపత్రులతో.. ప్రభుత్వ వైద్యం పోటీపడాలనేదే తమ ఆకాంక్ష అని, ఆ దిశగా సర్కారు వైద్యాన్ని బలోపేతం చేస్తున్నామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బస్తీ దవాఖానాలతో మంచి ఫలితాలు రావడంతో సీఎం కేసీఆర్ పల్లె దవాఖానాల పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. త్వరలో నాలుగు వేల పల్లె దవాఖానాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్‌రావు.. ‘ఈనాడు-ఈటీవీభారత్’తో ముఖాముఖిలో పలు అంశాలను వెల్లడించారు.
- పల్లె దవాఖానాలు ఎలా ఉంటాయి?
hospitals in villages Telangana : ప్రతి పల్లె దవాఖానాలోనూ ఒక ఎంబీబీఎస్ వైద్యుడు అందుబాటులో ఉంటారు. తద్వారా గ్రామీణులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరాన్ని తప్పిస్తాం. నకిలీ వైద్యుల బారినపడకుండా కాపాడతాం. వాటిలో పాము, తేలు, కుక్కకాటు మందులు అందుబాటులో ఉంచుతాం. దీంతో ప్రాణాపాయం తప్పుతుంది.
- కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయి సేవలు ప్రభుత్వ వైద్యంలో అందించేందుకు ఎలాంటి ప్రణాళిక అమలు చేయబోతున్నారు?
Radiology labs in districts Telangana :రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రేడియాలజీ ల్యాబ్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. ఇందులో ఈసీజీ, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, 2డీ ఎకో, సీటీ స్కాన్, మామోగ్రామ్ తదితర పరీక్షలను ఉచితంగా చేస్తారు. గర్భిణికి గుండె సమస్యో, మూత్రపిండాల సమస్యో ఉన్నప్పుడు.. ఆ కేసును స్వీకరించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి అతి ముప్పు ఉన్న గర్భిణులకు ఎదురయ్యే సమస్యలకు సత్వర చికిత్స అందించాలి. అందుకోసం నిమ్స్‌లోనూ 200 పడకలతో అత్యాధునిక మాతాశిశు సంరక్షణ ఆసుపత్రి(ఎంసీహెచ్)ని నెలకొల్పనున్నాం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి, కేంద్ర కారాగారం, కాకతీయ వైద్య కళాశాలల్లో కలుపుకొని 215 ఎకరాల్లో ‘వరంగల్ ఆరోగ్య నగరం(హెల్త్ సిటీ)’గా తీర్చిదిద్దనున్నాం. ఏడాదిన్నర లోగా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఇలాంటి అనేక కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలుచేస్తూ ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేస్తాం.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ సిజేరియన్లు పెరుగుతున్నాయి? దీన్నెలా చూడాలి?
Cesareans in government hospitals telangana : సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంపై ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తున్నాం. దీనికోసం మిడ్ వైఫరీ నర్సులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే వారిని 12 ఆసుపత్రుల్లో నియమించాం. అక్కడ మంచి ఫలితాలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్‌ఐసీయూలను 18 నుంచి 42కు పెంచుకున్నాం. గర్భిణుల కోసం ప్రత్యేకంగా 5 ఐసీయూలను నెలకొల్పాం. శస్త్రచికిత్సలు పెరగడం వల్ల శిశువులకు వెంటనే తల్లి పాలు అందించడం సాధ్యం కావడం లేదని మా పరిశీలనలో వెల్లడైంది. ఈ రెండింటిపైనా దృష్టిపెట్టాం.
- శవాగారాల్లో దుర్భర పరిస్థితులున్నాయి. వీటిని చక్కదిద్దే ప్రణాళిక ఉందా?
అత్యధిక ఆసుపత్రుల్లో శవాగారాలు తీవ్ర దుర్గంధంతో, కనీస వసతులు లేకుండా ఉన్నాయనే అంశం నాదృష్టికి వచ్చింది. ఎయిర్ కండిషన్డ్ ఫ్రీజర్లు అందుబాటులో లేకపోవడం వల్లనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్య పరిష్కరించేలా అత్యాధునిక ఫ్రీజర్లను అందుబాటులోకి తీసుకురానున్నాం. మురుగునీరు బయటకు వెళ్లేలా నిర్మాణాల్లో మార్పులుచేయాలని ఆదేశాలిచ్చాం. ఇందుకోసం రూ.25 కోట్లు మంజూరు చేయబోతున్నాం.
- రక్తశుద్ధి కేంద్రాలు అవసరాలకు సరిపడా లేవనే అభిప్రాయముంది?