Harish Rao At Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రిలో పలు అభివృద్ధి పనులను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. సీటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 7 కోట్ల రూపాయల వ్యయంతో క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అగ్నిమాపక యంత్రం, ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు... ఓపీ స్లిప్పుల జారీ కేంద్రం పనులకు శ్రీకారం చుట్టారు.
Harish Rao on Aarogyasri: ఉస్మానియాలో ప్రస్తుతం 2 సీటీ స్కాన్‌లు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. త్వరలో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, గాంధీ ఆస్పత్రిలో మారో 4 క్యాథ్‌ల్యాబ్‌లు అందుబాటులోకి తీసుకొస్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు. త్వరలో ఉస్మానియాలో 50 పడకల ఐసీయూ, కొత్త వెంటిలేటర్లు అందుబాటులోకి తెస్తామన్నారు. ఉస్మానియాలో కొత్త మార్చురీ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ సేవలు పెంచాలని వైద్యులకు సూచించారు. రానున్న రోజుల్లో ఆరోగ్య తెలంగాణగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉస్మానియాకు ఎన్‌ఏబీసీ అక్రిడేషన్ కోసం కృషిచేస్తామని తెలిపారు. జనవరి 1న మళ్లీ ఉస్మానియాను సందర్శిస్తానని హరీశ్‌రావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉస్మానియా భవనంపై మాట్లాడారు. కోర్టు తీర్పు తర్వాతే భవనంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
బ్రహ్మాండమైన విజయం..