రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల కొరత లేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మండలిలో వెల్లడించారు. వైద్య కళాశాలల అనుబంధ దవాఖానాల్లో వైద్యులు తగినంత మంది ఉన్నారని స్పష్టం చేశారు.
ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్యులను తొలగించాలి - telangana health minister etela rajender
ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తూ.. ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహించే వారిని విధుల నుంచి తొలగిస్తేనే సిబ్బంది కొరత సమస్య పరిష్కారమవుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో ఎక్కడ కూడా వైద్యుల కొరత లేదని స్పష్టం చేశారు.
ఈటల రాజేందర్, ఆరోగ్య శాఖ మంత్రి
ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తూ... ప్రైవేటుగా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారని... వేరే దవాఖానాల్లో ప్రైవేటుగా చికిత్సలు చేస్తున్నారని ఈటల ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని విధుల నుంచి తొలగిస్తేనే... ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు.