ఇంతకాలం ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మహమ్మారిని టీకాతో తరిమికొడుతున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైనట్లు తెలిపారు.
అధైర్యమొద్దు... అందరికీ టీకా ఇస్తాం: మంత్రి ఈటల - covid vaccination 2021 in Hyderabad
తెలంగాణలో 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మొదట్లో ప్రతి కేంద్రంలో 30 మందికి మాత్రమే టీకా ఇస్తారని వెల్లడించారు.
వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
ప్రతి కేంద్రంలో 30 మందికి మాత్రమే టీకా ఇస్తారని మంత్రి వెల్లడించారు. వ్యాక్సిన్ కోసం ఎవరూ తొందరపడొద్దని, ప్రాధాన్య క్రమంలో అందరికీ అందిస్తామని స్పష్టం చేశారు. కొవిడ్‌పై పోరాటంలో వైద్యారోగ్య, పారిశుద్ధ్య కార్మికుల కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు.
- ఇదీ చూడండి :గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
Last Updated : Jan 16, 2021, 1:05 PM IST