తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇతర దేశాలు భయపడినా.. మనం ధైర్యంగా కరోనాను ఎదుర్కొన్నాం: ఈటల - eetala speaks on corona situation in telangana

కరోనాను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందిన దేశాలు భయపడ్డాయని.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ధైర్యంగా ఎదుర్కొందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. కొవిడ్​ విజృంభణ సమయంలోనూ 108 ఉద్యోగులు నిబద్దతగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు.

eetala rajender
ఇతర దేశాలు భయపడినా.. మనం ధైర్యంగా కరోనాను ఎదుర్కొన్నాం: ఈటల

By

Published : Oct 11, 2020, 7:02 PM IST

మొదట్లో కరోనా కేసులు బయటపడినప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు సహా అందరూ భయపడ్డారని.. మనం మాత్రం ధైర్యంగా ఎదుర్కొన్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. తెలంగాణ భవన్​లో నిర్వహించిన 108 ఉద్యోగుల రెండో మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

గత ఏడు నెలలుగా కరోనా విజృంభిస్తున్నా.. కంటి మీద కునుకు లేకుండా కర్తవ్య నిర్వహణలో 108 ఉద్యోగులు నిమగ్నమయ్యారని ఈటల కితాబిచ్చారు. ఉద్యోగుల పనిగంటలు, జీతభత్యాలు, పీఎఫ్​ వంటి అంశాలపై త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు.

రాబోయే కాలంలో ప్రభుత్వ వైద్యమై పూర్తిస్థాయిలో అందాలని.. అందుకు అనుగుణంగానే సీఎం కేసీఆర్​ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కేసీఆర్​ కిట్ల వచ్చిన తర్వాత.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి కేసులు పెరిగాయని.. కల్యాణ లక్ష్మి పథకం తర్వాత బాల్య వివాహాలు ఆగిపోయాయని ఈటల అన్నారు.

ఇతర దేశాలు భయపడినా.. మనం ధైర్యంగా కరోనాను ఎదుర్కొన్నాం: ఈటల

ఇవీచూడండి:'వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి అనుమతి అప్పుడే'

ABOUT THE AUTHOR

...view details