Corona rules implementation in telangana : కరోనా మహమ్మారి మరోసారి తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు చాప కింద నీరులా విస్తరిస్తూ మరోసారి ప్రపంచాన్ని భయపెట్టేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని డీహెచ్ శ్రీనివాస రావు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు మాస్కు తప్పక ధరించాలని.. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
మాస్కు పెట్టు.. లేకపోతే రూ.వెయ్యి ఫైన్ కట్టు - corona rules in telangana
Corona rules implementation in telangana : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇక నుంచి ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు తప్పక మాస్కు ధరించాలని సూచించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
కరోనా నిబంధనల ఉల్లంఘన జరగకుండా పర్యవేక్షించాలని అధికారులకు డీహెచ్ శ్రీనివాస్ సూచించారు. లేనియెడల వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా కేసులు 500కు చేరువలో ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో.. భాగ్యనగర పరిసర ప్రాంతాల్లో కొవిడ్ వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైన దృష్ట్యా విద్యార్థులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యాజమాన్యాలు కూడా పాఠశాలల్లో కరోనా నిబంధలు కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.