మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.80 వరకు పలుకుతుండగా.. రాయితీ ఉల్లి అందుబాటులోకి రాగానే రూ.20 మేరకు తగ్గించి ఎర్రగడ్డ, మెహదీపట్నం రైతు బజార్లలో రూ.60కి విక్రయిస్తున్నారు. రాయితీ కిలో రూ.35.. ఒక్కొక్కరికి 2 కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో ధరలు అదుపులోకి వచ్చే వరకు అమ్మకాలు జరుపుతామని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. తొలి రోజు 25 టన్నులు సిద్ధం చేశామంటున్న మార్కెటింగ్ శాఖ అధికారులతో మా ప్రతినిధి ముఖాముఖి.
ధరలు అదుపులోకి వచ్చే వరకు రైతుబజార్లలో ఉల్లి అమ్మకాలు
ఉల్లి ధరల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వినియోదారులు ఇబ్బందులు పడకుండా జంటనగరాల్లోని 11 రైతుబజార్లలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రాయితీ ఉల్లిగడ్డల విక్రయ కేంద్రాలు తెరించింది. ఎర్రగడ్డ, మెహదీపట్నం రైతు బజార్లలో రాయితీ ఉల్లి విక్రయ కేంద్రాలను మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు రవికుమార్ ప్రారంభించారు.
ధరలు అదుపులోకి వచ్చే వరకు రైతుబజార్లలో ఉల్లి అమ్మకాలు