కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. వైరస్ కట్టడి, మరణాల నియంత్రణలో రాష్ట్రం దేశంలోనే ముందుందని పేర్కొన్నారు. దేశంలో మరణాల సగటు 1.4 ఉంటే రాష్ట్ర సగటు 0.54 ఉండటమే ఇందుకు నిదర్శనమని తెలిపారు.
కరోనా సంక్షోభంలో తెలంగాణ వ్యూహాత్మక అడుగులు: గవర్నర్ - telangana assembly updates
కొవిడ్ వల్ల దేశమంతా ఇబ్బంది పడిందని, కానీ తెలంగాణ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించారు.
![కరోనా సంక్షోభంలో తెలంగాణ వ్యూహాత్మక అడుగులు: గవర్నర్ telangana Governor Tamilisai soundararajan speech in assembly on corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11012301-830-11012301-1615790350601.jpg)
కరోనా సంక్షోభంలో తెలంగాణ వ్యూహాత్మక అడుగులు
కరోనా సంక్షోభంలో తెలంగాణ వ్యూహాత్మక అడుగులు
బాధితులకు వైద్యం అందించడంలోనూ తెలంగాణ ముందుందన్న గవర్నర్.. 97.88 శాతం రికవరీ రేటుతో దేశం కంటే మెరుగ్గా ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా సాగుతోందని తమిళిసై తెలిపారు.