విశ్వవిద్యాలయాల పనితీరుపై గవర్నర్ సమీక్ష - గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పనితీరుపై గవర్నర్ తమిళిసై సమీక్షించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీలు, విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు.
విశ్వవిద్యాలయాలు పనితీరుపై గవర్నర్ సమీక్ష
తెలంగాణలోని విశ్వవిద్యాలయాల పనితీరుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యా మండలి అధికారులు, తొమ్మిది యూనివర్సిటీల ఇంఛార్జి వీసీలతో సమావేశమయ్యారు. పూర్తిస్థాయి వీసీల నియామకం, ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు, బోధన, బోధనేతర ఖాళీలు, బయోమెట్రిక్ హాజరు విధానం, హాస్టళ్లలో నాన్ బోర్డర్లు, విద్యార్థులకు సదుపాయాలు, తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది.
- ఇదీ చూడండి : 'ప్రజావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తా'