రాజ్‌భవన్‌లో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. బోనం ఎత్తిన గవర్నర్ తమిళిసై... మేళతాళాలతో తమ నివాసం నుంచి బయలుదేరారు. రాజ్‌భవన్ ప్రాంగణంలోని అమ్మవారి గుడి వరకు ఊరేగింపుగా వెళ్లి.. బోనం సమర్పించారు. రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. మరింత అభివృద్ధిని సాధించాలని ప్రార్థించినట్లు తమిళిసై తెలిపారు. ఈ వేడుకలో గవర్నర్ కుటుంబ సభ్యులు, రాజ్‌భవన్ సిబ్బంది, రాజ్‌భవన్ పరివార్‌కు చెందిన మహిళలు పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు.
అంతకుముందు.. తల్లి పాల ముగింపు వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. తల్లి పాలు దానం చేసిన 26 మందికి ధాత్రి మదర్స్ మిల్క్ ఆధ్వర్యంలో... 'మా యశోదరా అవార్డ్స్' అందజేశారు. నిలోఫర్ ఆస్పత్రిలో సేవలందించిన నలుగురు నర్సులకు 'పన్నదాయి అవార్డు'లు, తల్లి పాలపై విశేష అవగాహన కల్పిస్తున్న దుర్గా ప్రసాద్‌కు 'అమృత్ కలశ్ అవార్డు'ను గవర్నర్ అందజేశారు.
తల్లి పాలతో ఎన్నో లాభాలు...