తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Governor on Omicron : 'అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే నా ఆకాంక్ష'

Telangana Governor on Omicron : రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్న తరుణంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్​లో కొత్త సంవత్సర వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ప్రజలు.. సూచనలు, సమస్యల గురించి తెలిపేందుకు రాజ్‌భవన్‌లో డ్రాప్‌బాక్స్‌ సేవలను గవర్నర్‌ ప్రారంభించారు.

Telangana Governor on Omicron
Telangana Governor on Omicron

By

Published : Jan 1, 2022, 12:26 PM IST

రాజ్​భవన్​లో న్యూ ఇయర్ వేడుకలు

Telangana Governor on Omicron : 2022 కరోనా రహిత సంవత్సరం అవుతుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. బలమైన ఆహారం, భారతీయ వంటకాలు తీసుకోవాలని సూచించారు. దేశంతో పాటు రాష్ట్ర ఆరోగ్య రంగం అభివృద్ధి చెందుతోందని అన్నారు. రాజ్‌భవన్​లో కొత్త సంవత్సర వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ప్రజలు.. సూచనలు, సమస్యల గురించి తెలిపేందుకు రాజ్‌భవన్‌లో డ్రాప్‌బాక్స్‌ సేవలను గవర్నర్‌ ప్రారంభించారు. పేద విద్యార్థులకు ఎన్జీవో సాయంతో ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు.

New Year Celebrations at Telangana RajBhavan : 'అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే నా సందేశం. కరోనా సంక్షోభం వేళ వైద్యరంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. తొలి డోసు వ్యాక్సిన్‌ వందశాతం పూర్తైన సందర్భంగా ప్రభుత్వానికి, ప్రజలకు అభినందనలు. ఈ లక్ష్యం సాధించిన తొలి పెద్ద రాష్ట్రం మనదే. ఒమిక్రాన్‌ కేసులు వస్తున్న తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. అందరికీ 2022 కొత్త ఏడాది శుభాకాంక్షలు.'

- తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్

ఒమిక్రాన్​ను ఎదుర్కోగలం..

Telangana Governor New Year Wish 2022 : రాష్ట్రంలో 100 శాతం కరోనా మొదటి డోస్ పూర్తయిందని గవర్నర్ తెలిపారు. దీని కోసం కృషి చేసిన అధికారులు, ఆరోగ్య శాఖ, ప్రభుత్వాన్ని అభినందించారు. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరి సహకారంతో కరోనా మాదిరి ఈ మహమ్మారిని కూడా ఎదుర్కోగలుగుతామని అన్నారు.

వెంకన్న సన్నిధిలో తమిళిసై..

Telangana Governor on Omicron Cases : అంతకుముందు.. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. దేశ ప్రజలంతా సుభిక్షంగా.. ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

న్యూ ఇయర్ సెల్ఫీ విత్ గవర్నర్..

Tamilisai On Omicron Cases : నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. భౌతిక దూరం పాటించాలని గవర్నర్ సూచించారు. ఆలయానికి వచ్చిన భక్తులతో ముచ్చటిస్తూ న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. పలువురు భక్తులు గవర్నర్​తో సెల్ఫీలు దిగారు.

ABOUT THE AUTHOR

...view details