ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వాగతించారు. ఆరోగ్యశ్రీ సహా ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వీలైనంత ఎక్కువ మంది బాధితులు లబ్ధి పొందే అవకాశాలున్నాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వానికి తాను చేసిన సుధీర్ఘమైన వినతుల్లో ఒకటని గవర్నర్ ట్వీట్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ హర్షం - తెలంగాణలో కరోనా ప్రభావం
తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ పథకంలో చేరుతున్నట్లు ప్రకటన చేయడంపై గవర్నర్ తమిళిసై హర్షం వ్యక్తంచేశారు. ఈ అంశం తాను రాష్ట్ర సర్కారుకు చేసిన సుధీర్ఘమైన వినతుల్లో ఒకటన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ హర్షం