భారీ వర్షాలతో అతలాకుతలమైన భాగ్యనగర ప్రజలకు తెలంగాణ సర్కార్ అండగా నిలుస్తోంది. వరద బాధితులకు రూ.10వేలు అందిస్తూ ఆదుకుంటోంది. కూకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్‌లో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి నగదు పంపిణీ చేశారు. మొత్తం 83 మంది లబ్ధిదారులకు నగదు అందజేసినట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. అనంతరం బాధితులకు నిత్యావసర సరకులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
భాగ్యనగర వరద బాధితులకు రూ.10వేల ఆర్థిక సాయం - financial help to Hyderabad flood victims
పేద ప్రజలకు ఆపన్నహస్తం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. వరద బాధితులకు తెలంగాణ సర్కార్ అందిస్తోన్న రూ.10వేలను బాలాజీనగర్‌లోని కైతలాపూర్‌లో పంపిణీ చేశారు.
భాగ్యనగర వరద బాధితులకు రూ.10వేల ఆర్థిక సాయం
విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆర్థికంగా ఆదుకున్న పార్టీ కేవలం తెరాసయేనని కృష్ణారావు అన్నారు. పేద ప్రజలకు ఆపన్నహస్తం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు.