ఆసుపత్రి వరకు వెళ్లలేని డయాలసిస్ రోగులకు ఒక్క ఫోన్ చేస్తే డయాలసిస్ ఆంబులెన్స్‌లు ఇంటికే వచ్చి చికిత్స అందిస్తాయి. తొలుత 10 అంబులెన్స్‌లను ఏర్పాటు చేసి తర్వాత ఆ సంఖ్యను పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం.. వీటికోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 43 రక్తశుద్ధి కేంద్రాల్లో 267 డయాలసిస్ యంత్రాలున్నాయి.
శుభవార్త: డయాలసిస్ రోగులకు ఇంటివద్దే రక్తశుద్ధి - dialysis ambulances in telangana
డయాలసిస్ రోగులకు ఇది శుభవార్త. ఆసుపత్రి వరకు వెళ్లలేని రోగులకు ఇంటి వద్దే రక్తశుద్ధి(డయాలసిస్) చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేకంగా డయాలసిస్ అంబులెన్సులను అందుబాటులోకి తీసుకురాబోతోంది.
ఉమ్మడి జిల్లాల్లో సగటున రెండు చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో త్వరలో మరో డయాలసిస్ కేంద్రంతోపాటు 10 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లోని డయాలసిస్ కేంద్రాల్లో అదనంగా పడకలు, యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. డయాలసిస్ రోగుల్లో 90 శాతం వరకు రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నారు. వీరిలో చాలామంది డయాలసిస్ కోసం ఆసుపత్రి వరకు వెళ్లలేకపోతున్నారు. అలాంటి వారికి డయాలసిస్ అంబులెన్సులతో ఊరట కలగనుంది.