తెలంగాణ

telangana

ETV Bharat / city

'రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం పగటి కలే' - Telangana government whip Guvala Balaraju

2048 వచ్చినా... రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాలేదని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. భాజపా శ్రేణులుగానీ.. బండి సంజయ్ గానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

guvala-balaraju-warning-to-bjp-state-president-bandi-sanjay
బండి సంజయ్​పై గువ్వల బాలరాజు విమర్శలు

By

Published : Jan 8, 2021, 5:22 PM IST

బండి సంజయ్ ఇంకా కార్పొరేటర్ కాదని.. ఎంపీ అనే విషయాన్ని గుర్తుంచుకుని స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించాలని ప్రభుత్వ విప్ గువ్వలరాజు హితవు పలికారు. దాడులకు దిగితే ప్రతిదాడులకు వెనకడుగు వేసేదిలేదని స్పష్టం చేశారు.

సంయమనం పాటిస్తుంటే.. రోజూ సవాళ్లు విసురుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అమలు చేసినన్ని సంక్షేమ పథకాలు భాజపా పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని గువ్వల తెలిపారు.

తెలంగాణ ప్రజాస్వామ్యానికి అడ్డా అని భాజపా గుర్తుంచుకోవాలని బాలరాజు అన్నారు. రాష్ట్రాన్ని అల్లర్లతో అగ్నిగుండం చేయాలనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details