తెలంగాణ

telangana

ETV Bharat / city

Ganesh immersion: నిమజ్జనంపై నిర్ణయానికి వారం సమయం కోరిన ప్రభుత్వం - విచారణ

హుస్సేన్​సాగర్​లో గణేశ్​ నిమజ్జనాన్ని నిషేధించాలన్న పిటిషిన్​పై హైకోర్టు మరోసారి విచారించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకోడానికి మరో వారం రోజుల సమయం కావాలని ధర్మాసనాన్ని ప్రభుత్వం కోరింది. సర్కారు అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం... తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

Ganesha immersion
Ganesha immersion

By

Published : Aug 11, 2021, 3:17 PM IST

Updated : Aug 11, 2021, 3:27 PM IST

ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో గణేశ్​ నిమజ్జనం అంశంపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. హుస్సేన్ సాగర్​లో గణేష్, దుర్గ విగ్రహాల నిమజ్జనం నిషేధించాలని కోరుతూ న్యాయవాది వేణుమాధవ్ 2011లో దాఖలు చేసిన పిటిషన్​పై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఆగస్టు 5న.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారించి.. ప్రభుత్వ నిర్ణయాన్ని పదో తేదీ లోపల తెలపాలని ఆదేశించింది.

అదే పిటిషన్​పై మళ్లీ ఈరోజు విచారణ చేపట్టగా.. నిమజ్జనంపై నిర్ణయానికి మరో వారం రోజుల సమయాన్ని ప్రభుత్వం కోరింది. పండుగ దృష్ట్యా జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. గతేడాది పెట్టిన ఆంక్షలు, నిబంధనల్లో సడలింపులు ఉండొద్దని హైకోర్టు తెలిపింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

Last Updated : Aug 11, 2021, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details