తెలంగాణ

telangana

ETV Bharat / city

మెడికల్​ దుకాణాల్లో మందులు కొన్నవారికి కరోనా పరీక్షలు

జలుబు, దగ్గు, జ్వరానికి మందులు కొనుగోలు చేసేవారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మెడికల్ దుకాణాల నిర్వాహకులు, ఫార్మసిస్ట్ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించాలని కోరుతూ ప్రభుత్వం మెమో జారీచేసింది.

telangana government trying for corona test who buy medicine in shops
మెడికల్​ దుకాణాల్లో మందులు కొన్నవారికి కరోనా పరీక్షలు

By

Published : Apr 18, 2020, 7:25 PM IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో జలుబు, దగ్గు, జ్వరానికి మందులు కొనుగోలు చేసేవారి వివరాలను సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. వారందరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది.

మెడికల్ దుకాణాల నిర్వాహకులు, ఫార్మసిస్ట్ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించాలని కోరుతూ ప్రభుత్వం మెమో జారీచేసింది. జీహెచ్​ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషర్లతోపాటు ఆయాజిల్లాలో అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు బాధ్యతను అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

కరోనా లక్షణాలు ఉన్నవారికి మందులు అందించే ముందు వారి వివరాలను తప్పక సేకరించాలని కోరింది. ఆ వివరాలతో ఆయా ప్రాంతాల్లోని వారికి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.

ఇవీచూడండి:కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష.. లాక్​డౌన్​పై కీలక చర్చ

ABOUT THE AUTHOR

...view details