Telangana Loan: రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు వేల కోట్ల రూపాయలు రుణంగా తీసుకోనుంది. ఈ మేరకు 13 ఏళ్ల కాలానికి ఆర్థికశాఖ బాండ్లు జారీ చేసింది. రిజర్వ్ బ్యాంకు ద్వారా ఈ నెల 11వ తేదీన బాండ్లను వేలం వేయనున్నారు. రైతుబంధు చెల్లింపులు సహా ఇతర అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుకుంటోంది. ఈ నెలలో ఇప్పటికే 1187 కోట్ల రూపాయలను రుణంగా తీసుకొంది. తాజా రుణంతో ఈ నెలలో ప్రభుత్వం తీసుకున్న అప్పులు నాలుగు వేల కోట్ల రూపాయలు దాటనున్నాయి.
Telangana Loan: మరో మూడు వేల కోట్ల రుణం తీసుకోనున్న తెలంగాణ సర్కారు.. - రిజర్వ్ బ్యాంకు
Telangana Loan: రాష్ట్ర అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం మరి కొంత సొమ్ము రుణంగా తీసుకోనుంది. రిజర్వ్‌బ్యాంకు వేయనున్న బాండ్ల వేలంలో మరో మూడు వేల కోట్లను రుణంగా సమీకరించనుంది.
![Telangana Loan: మరో మూడు వేల కోట్ల రుణం తీసుకోనున్న తెలంగాణ సర్కారు.. Telangana government to borrow another Rs 3,000 crore from reserve bank bands](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14127414-928-14127414-1641591512385.jpg)
Telangana government to borrow another Rs 3,000 crore from reserve bank bands