ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా బాధితుల ఇబ్బందులను గట్టెక్కించేందుకు ప్రభుత్వం నడుం కట్టింది. కరోనా బాధితుల నుంచి ప్రైవేట్, కార్పోరేట్ ఆస్పత్రులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ వచ్చిన వార్తలపై స్పందించిన సీఎం కేసీఆర్.. ప్రైవేట్ ఆస్పత్రుల చేష్టలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఎక్సైజ్ శాఖ సంచాలకులు సర్ఫరాజ్ అహ్మద్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య ఈ ఫోర్స్లో సభ్యులుగా ఉన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు కొవిడ్ రోగులకు అందిస్తున్న చికిత్స, సంబంధిత అంశాలను టాస్క్ఫోర్స్ పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ నిర్దేశిత ధరలకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నారా లేదా అన్న అంశంతో పాటు.. కొవిడ్ చికిత్సలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా వంటి అంశాలను టాస్క్ఫోర్స్ పరిశీలించనుంది. ఎప్పటికప్పుడు ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక ఇవ్వాలని టాస్క్ఫోర్స్ను ప్రభుత్వం ఆదేశించింది. టాస్క్ఫోర్స్కు అవసరమైన సాంకేతిక సహకారాన్ని వైద్య, ఆరోగ్యశాఖ అందించనుంది.
ప్రైవేట్ ఆస్పత్రుల పర్యవేక్షణకు.. ప్రత్యేక టాస్క్ఫోర్స్!
ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా బాధితులను దోచుకుంటున్నాయని వస్తున్న వార్తలపై ప్రభుత్వం స్పందించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యవహారాలను పరిశీలించేందుకు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పాజిటివ్ సోకిన రోగులకు అందించే చికిత్సను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ఫోర్స్ను నియమిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రైవేట్ ఆస్పత్రుల పర్యవేక్షణకు.. ప్రత్యేక టాస్క్ఫోర్స్!