తెలంగాణ

telangana

ETV Bharat / city

అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాలు విడుదల - priests salaries is released in telangana

రాష్ట్రంలో అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ.30 కోట్ల రూపాయల విడుదలకు అనుమతులు ఇచ్చింది. పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

telangana news, telangana priests salary
తెలంగాణ వార్తలు, తెలంగాణ అర్చకుల వేతనాలు విడుదల

By

Published : May 31, 2021, 6:47 PM IST

రాష్ట్రంలో అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల కోసం నిధులు విడుదలయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల నుంచి నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతించింది.

అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు రూ.30 కోట్ల రూపాయలు విడుదల చేసింది. సర్వశ్రేయోనిధి కింద సాయానికి రూ.5.93 కోట్లు, ఆలయాలకు సాయానికి సంబంధించి 6.56 కోట్ల రూపాయల విడుదల చేయనున్నారు. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details